![]() |
![]() |
దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సున్నితమైన అంశాల్ని తీసుకొని సినిమాగా రూపొందించడం, ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆర్టికల్ 370ని కథాంశంగా తీసుకొని అదే టైటిల్‌తో తెరకెక్కించడం సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. అలాంటి సాహసాన్ని ఎంతో సమర్థవంతంగా, మరెంతో పకడ్బందీ చేశారు నిర్మాతలు జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్యధర్, లోకేష్ధర్. గతంలో రెండు జాతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు ఆదిత్య సుహాస్ జంబలే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019లో ఎత్తివేసిన విషయం తెలిసిందే. అదే ప్రధానాంశంగా తీసుకొని పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ చిత్రంలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించింది. కశ్మీర్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఘర్షణలు, అవినీతిపై పోరాటం జరుగుతూ ఉంటుంది. జమ్ము కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక స్టేటస్ వల్ల ఆమె విధులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఘర్షణలను అరికట్టేందుకు కూడా ఈ ఆర్టికల్ ఇబ్బందిగా ఉంటుంది. అదే సమయంలో ఆర్టికల్ 370ను ప్రభుత్వం ఎత్తేయాలని నిర్ణయించే క్రమంలో జరిగిన ప్రక్రియను కూడా ఈ ట్రైలర్లో చూపించడం జరిగింది. అంతేకాదు, ఆర్టికల్ 370 ఎత్తేసన తర్వాత జరిగిన పరిణామాలను కూడా చూపించారు. పార్లమెంట్లో ఒక ఎం.పి. ‘కశ్మీర్ గతంలో భారతదేశంలోని అంతర్భాగంగా ఉంది. ఇప్పుడూ ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానికోసం మా ప్రాణాలైనా ఇస్తాం’ అని చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.
ఈ ట్రైలర్ ప్రారంభం నుంచి ఆఖరు వరకు ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2 నిమిషాల 43 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఎంతో గ్రిప్పింగ్‌గా ఉంటూనే ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది. ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ట్రైలర్లో చూపించిన సన్నివేశాలు, డైలాగులు ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. శష్వాంత్ సచ్దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని చాలా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ‘ఆర్టికల్ 370’ చిత్రం గురించి తన భావాలను దర్శకుడు ఆదిత్య సుహాస్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పంచుకున్నారు. భారత దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఈ సినిమా చూపించామని, ఇది రాజకీయ అంశమే అయినప్పటికీ యాక్షన్ పాళ్ళు కూడా సినిమాలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కశ్మీర్, ఢల్లీిలలో చేశామని వెల్లడిరచారు.
![]() |
![]() |